తౌక్టే తుఫాన్ తో ఇప్పటికే కేరళ వణికిపోతుంది. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అయితే తౌక్టే తుఫాను తెలంగాణా రాష్ట్రం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రంలో దక్షిణ దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (18,19,20వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుండి మెరుపులు వర్షములు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయని వాతావరణ పేర్కొంది.
వాతావరణ హెచ్చరికలు:- రాగల 3 రోజులు (18,19,20వ.తేదీలు) ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఒకటి, రెండు ప్రదేశములలో తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయని కూడా పేర్కొంది.