కేరళ సముద్ర తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయఅరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి…
ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ,రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి…
‘యాస్’ అతి తీవ్ర తుఫాను బలహీనపడగా మిగిలి ఉన్న భాగం తీవ్ర అల్పపీడనంగా తూర్పు ఉత్తర ప్రదేశ్ ఈ యొక్క తూర్పు ప్రాంతాలు మరియు దానిని ఆనుకుని ఉన్న బీహార్ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది రాగల 12 గంటలలో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు…
నిన్నటి తుఫాను యాస్ తీవ్రమై నిన్న రాత్రి తీవ్ర తుఫాను ‘YAAS'(యాస్)గా మారింది. ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు పశ్చిమ & పరిసరాల్లోనే ఉన్న తూర్పుమధ్య & ఉత్తర బంగళాఖాతంలో కొనసాగుతూ, పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిమి దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ, మరింత…
యాస్ తుఫానుపై హోమ్ మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు సీఎం జగన్. ఈ సందర్బంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు వివరించారు అధికారులు. తుఫాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని..ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం…
దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జూన్ మొదటి వారం నుంచి దేశమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశంలో జ్వరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో వాతావరణం కూడా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో జ్వరాలు కాస్త తక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చేసరికి సీజనల్ వ్యాధులు కొన్ని వచ్చే…
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం… రేపటికి తుఫాన్ గా మారనుంది. అయితే ఈ తుఫాన్ కు యాస్ గా నామకరణం చేసారు. ఈ “యాస్”తీవ్ర తుఫాన్ గా బలపడి ఈనెల 26న ఒడిషా,బెంగాల్ తీరాన్ని తాకుతుందని అంచనా వేశారు అధికారులు. బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తుఫాన్ కారణంగా ఐదు రోజులు మత్య్సకారుల వేటపై నిషేధం విధించారు. బంగాళాఖాతంలో తుఫాను…
తెలంగాణకు మరో 3 రోజులపాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి దిశ నుండి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, దక్షిణ బంగళాఖాతంలో కొంత భాగం, నికోబార్ ద్వీపం, దక్షిణ అండమాన్ సముద్రము మొత్తం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొంత భాగాములోకి నైరుతి రుతపవనాలు ఈరోజు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.…
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటలలో నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఎల్లుండి (22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని… ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది…
నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈనెల 21వ తేదీన ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో నైరుతి దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (19,20,21వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి…