తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అత్యంత తీవ్ర తుఫాను’ తౌక్టే’ ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. గడచిన 6 గంటలలో 15 km వేగంతో ప్రయాణిస్తూ, బలపడి ఈ రోజు ఉదయం 08:30 గంటలకు 18.8°N latitude మరియు 71.5°E longitude లలో, ముంబయికి పశ్చిమ దిశగా 150 km దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, గుజరాత్ తీరంలోని పోర్బందర్ – మహువాల మధ్య ఈ రోజు రాత్రి 20:00 నుండి 23:00 మధ్య 155-165 kmph గరిష్ట వేగములతో అత్యధికంగా 185 kmph వేగముతో తీరాన్ని దాటే అవకాశం వుందని పేర్కొంది. ఇక తౌటే తుపాను ప్రభావంతో తెలంగాణలో దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. రాష్‌ర్టంలో రాగల మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రోజు ఒకట్రెండు చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.