Gujarat Rains: గుజరాత్‌ను భారీ వర్షాలు.. 20 మంది మృతి, 23 వేల మంది సురక్షితం..
- గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు..
- వరదల వల్ల 20 మంది మృతి చెందగా
- మరో 23 వేల మంది సురక్షితం..
- సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న 300 మంది సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Rains: గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతుంది. ఇప్పటికే పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 20 మంది ప్రాణాలను విడిచారు. అలాగే, మరో 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. సుమారు 300 మంది సహాయక బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
Read Also: Nobel Peace Prize : గాజా దురాగతాలు చూపిన నలుగురు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ ?
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ఇక. గాంధీనగర్‌లో 2, ఆనంద్‌లో 6, మోర్బీలో 1, వడోదరలో 1, ఖేదాలో 1, మహిసాగర్‌లో ఇద్దరు మరణించారు. అలాగే, భరూచ్‌లో మరోకరు మరణించగా, అహ్మదాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 23,870 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. మరో 1,696 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే, మంగళవారం వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణవాఖ గుజరాత్‌కు హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Khushboo: ఖుష్బూకి గాయం.. అసలేమైంది?
అలాగే, రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి , గుజరాత్ సర్కార్ ఆరు ఇండియన్ ఆర్మీ బృందాల సహాయం కోరింది. దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో ఇండియన్ ఆర్మీ, 14 ఎన్‌డీఆర్‌ఎఫ్, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో భాగమయ్యాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కొలాప్స్ అయింది.
ఇక, భారీ వర్షాలు, సహాయక చర్యలను సమీక్షించేందకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసుల సహకారం తీసుకుని పూర్తి అప్రమత్తతతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
गुजरात में भारी बारिश से जनजीवन अस्त व्यस्त.. कृपया इस मौसम में सावधानी बरतें
सावधान रहें.! सुरक्षित रहे.!!#HeavyRainfall #GujaratRains #HeavyRainAlert pic.twitter.com/n9Qlh9pmPy— Mukesh Jeetrawal (@MukeshJeetrawal) August 28, 2024
#HeavyRainfall
अगर बहुत जरूरी ना हो तो इस समय गुजरात घूमने से बचे,बारिश ने कहर मचाया हुआ है। खासकर अहमदाबाद,वडोदरा में भयंकर बारिश है।
प्रभु धीर धरो..बाढ़ के हालात हैं #GujaratFlood #HeavyRain #GujaratRains #vadodararain #HeavyRainAlert #Gujarat #Ahmedabad #AhmedabadRains pic.twitter.com/5ddCzz6SdU
— Monu kumar (@ganga_wasi) August 28, 2024
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!