Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఆదేశాలు ఇచ్చారు. ఇక, కర్నూల్, నంద్యాల, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ హెచ్చరికలు ఇచ్చింది. అలాగే, రెడ్ అలెర్ట్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. నూతన పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఆమోదం
ఇక, మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. చెన్నైకు 320కిలో మీటర్లు.. పుదుచ్ఛేరికి 350 కిలో మీటర్లు.. నెల్లూరు తీరానికి 400 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం ఉంది. గంటకు 12 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది. అలాగే, కాకినాడ, గంగవరం, విశాఖ పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చిరికను జారీ చేశారు. మచిలీపట్నం, నిజాం పట్టణం ఓడరేవు పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేయబడింది. సూళ్లూరుపేటలో 22, కావాలిలో 18 సెంటీ మీటర్లు వర్ష పాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది.