Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీగా మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం నుంచి ఇంకా తేరుకోక ముందే బెజవాడకు మరో వాయుగుండంతో గజగజలాడబోనుంది.
Vijayawada Floods: ముంపు బాధితుల వద్ద నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
ఇకపోతే ప్రస్తుతం నీట మునిగిన విజయవాడ నగరం ఇంకా నీటిలో నుంచి బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజయవాడ నగరవాసులకు ప్రత్యేకమైన సహాయసహకారాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకొని సహాయక చర్యలను చేపట్టిస్తున్నారు.