Weather Update: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన
- రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.
Read Also: Heavy Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన.. మరో 4 రోజులు వానలే వానలు..!
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
తెలంగాణలోనూ వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షం చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్సుందని ఐఎండీ తెలిపింది. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వరకు వానలు తెరిపివ్వకపోవచ్చని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!