AP Rains: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే రెండ్రోజుల పాటు భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వెల్లడించింది. అలాగే, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది.
Read Also: Kishan Reddy: పేదల జోలికొస్తే ఖబర్దార్! .. హైడ్రా చర్యలపై కిషన్ రెడ్డి ఫైర్
ఇక, అక్టోబర్ 4వ తేదీన అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. కాగా, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని.. అలాగే, పొలాల వద్ద ఉండే రైతులు, రైతు కూలీలు చెట్ల కింద ఉండొద్దని పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.