ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాన్ క్రమంగా బలపడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 970 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యింది. రాగల ఆరు గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశ మార్చుకుంటుందని తెలిపింది. అనంతరం ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం చేరే…
మండు వేసవిలో ఏపీకి తుఫాన్ అలర్ట్ పొంచి ఉంది. ఏపీలో ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు అకాల వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 8 నాటికి ఈ వాయుగుండం తుఫాన్‌గా రూపు సంతరించుకుంటుందని… ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య ఈ…
ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో ఈ సాయంత్రం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా జిల్లాలలో రైతులు వెంటనే పొలాల నుంచి ఇంటికి చేరుకోవాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన…
ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ కేంద్రం.. ఈ రోజు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపోఆవరణములో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉండనుంది.. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో.. ఈరోజు, రేపు…
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. సుమారు రెండు నుంచి మూడు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాగల 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని హైదరాబాద్…
ఏపీలో ఓ వైపు ఎండల వల్ల ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే మరోవైపు భారీ వర్షాల వల్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సోమవారం నాడు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం, విజయనగరం జిల్లాలోని…
ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని…
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి…
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో మార్చి 4 నుంచి ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెదర్…
పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ…