ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు మరియు పొరుగున ప్రాంతాల్లో ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ, వాతావరణ కేంద్రం, అమరావతి వెల్లడించింది.. దీని ప్రభావంతో.. రాబోయి మూడు…
Andhra Pradesh Weather: వర్షాకాలంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు దంచికొట్టగా ప్రస్తుతం ఆ బాధ్యతను భానుడు అందుకున్నాడు. దీంతో ఏపీలో వర్షాకాలంలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా…
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీరం డిగాకు సమీపంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24గంటలు వాయుగుండంగానే ప్రయాణం చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
As many as eight people have died after a wall collapsed due to incessant rain in Gujarat. Thousands of people have been affected by the flood-like situation in the states gujaraj and maharashtra.
తెలంగాణలో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రేపటి నుంచి అంటే జూలై 11 నుంచి జూలై 13 వరకు మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. Read Also: Amaranath Yatra: ఇద్దరు ఏపీ యాత్రికులు గల్లంతు.. ఏపీ సర్కార్ ప్రకటన మరోవైపు తెలంగాణలో…
వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. నిన్న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు… మరింత బలపడి మరో మూడు రోజుల్లో రాష్టాన్ని పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు రాష్టంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు ఈశాన్య, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. రేపు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వుందని వాతావరణ శాఖ అధికారులు…
ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు…
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముందుగానే విస్తరించే అవకాశం ఉన్నా. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. అయితే.. నిన్న మండపేటలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. పడమర నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఎండలు పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, నిన్న వడగాల్పులు వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉండడం, వర్ష సూచన లేకపోవడంతో కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో వడగాలులు వీచినట్టు…
అసని తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫాన్‌గా మారింది. దిశను మార్చుకున్న అసని మచిలీపట్నానికి 50కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతుండగా.. నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకే అవకాశముంది. అనంతరం కాకినాడ దగ్గర సముద్రంలోకి వచ్చి బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా విశాఖకు రావాల్సిన, వెళ్లాల్సి ఉన్న అన్ని విమానాలను…