తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం వచ్చేసింది. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. సోమవారం తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలకు చేరాయి. కడపలో 36.2, తూర్పుగోదావరి జిల్లా తునిలో 36.1, ప్రకాశం జిల్లా ఒంగోలులో 35.7, అమరావతిలో 35.2…
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు…
సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని… ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. Read Also: మందు బాటిల్ ముందేసుకుని…
తెలంగాణలో చలి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల తక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగుజాగ్రత్తలు వహించాలని వారు సూచించారు. Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది మరోవైపు…
తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే చలితో వణికిపోతున్నాయి.. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది… ఉత్తర గాలులు తక్కువ ఎత్తులో ఉత్తరాంధ్రలోను.. మరియు తూర్పు గాలులు దక్షిణ ఏపీలో మరియు రాయలసీమలోనూ వీస్తున్నాయి.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు రేపు…
హైదరాబాద్ నగరంలో చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఈ దశాబ్దంలోనే డిసెంబర్ నెలకు సంబంధించి అత్యంత చలి రోజుగా 18వ తేదీ (శనివారం) రికార్డు సృష్టించింది. శనివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.2 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలో డిసెంబర్ నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీల…
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read Also: ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరో వర్ష సూచన ఉంది అని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం… రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది అని ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. అది శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో…
ఏపీని వానగండం వదిలేలా లేదు. సాయంత్రానికి అండమాన్ లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆ తర్వాత 48 గంటల్లో బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.