Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీవర్షాలకు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి చేరువలోకి వస్తుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపుతుంది.
అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు పడతాయనే అంచనాతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!