ఏపీని వరదలు వదలనంటున్నాయి. ఏపీపై యుద్ధం ప్రకటించినట్లుగా వెనువెంటనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి ఏపీకి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈనెల 28, 29 తేదీల్లో తిరుపతి, నెల్లూరు నగరాలలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. Also Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే.. సుమారు 13 సెం.మీ…
ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణమధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాగాల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి శ్రీలంక మరియు దక్షిణ తమిళనాడు…
ఏపీలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీ సరిహద్దు జిల్లాలలో కుంభవృష్టి వానలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తడంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రజా జీవనం స్తంభించింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన… ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని వాతావరణ…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుతో పాటు ఏపీపై విరుచుకుపడింది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించాయి. చెరువులకు గండ్లుపడి గ్రామాల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. కొన్ని గ్రామాలు వరద నీటి దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలం అవుతున్న వేళ మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Read Also : What’s…
దక్షిణ అండమాన్ మరియు దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 . 1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక , దాని పరిసర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన చేసింది వాతావరణ శాఖ.…
ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ మరియు దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 . 1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ఫలితం…
ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. వాయుగుండంపై బులెటిన్ విడుదల చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తర తమిళనాడు..దక్షిణ కోస్తా మధ్య చెన్నై-పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ…
ఏపీని భారీవర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైకి ఆగ్నేయంగా 310కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయి వుంది. రేపు తమిళనాడు,దక్షిణ కోస్తా మధ్య తీరం దాటనున్న వాయుగుండం. కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ మెస్సేజ్ వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ. రెండు జిల్లాలలో రేపటి వరకు భారీ వర్షాలు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జలదిగ్బంధంలో కపిలతీర్దం. ఆలయంలోకి భక్తుల అనుమతి నిలిపివేసింది టీటీడీ.…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురియడంతో తమిళనాడులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంప్రదించాలని సూచిస్తూ.. కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు…
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికీ ఏపీ, తమిళనాడు తో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఏపీలో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ…