ఎండల నుంచి ఉపశమనం లభిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 18–21 మధ్య రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. 19వ తేదీ నుంచి రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. క్రమంగా కోస్తాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
High Temperatures: ఆంధ్రప్రదేశ్‌లో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. ఎండలు మండిపోతున్నాయి, వడగాల్పులు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.. నేడు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఈరోజు అల్లూరి జిల్లాలోని 2, అనకాపల్లిలో 1, బాపట్లలోని 7, తూర్పుగోదావరిలోని 7, పశ్చిమ గోదావరిలోని 3, ఏలూరులోని 4 మండలాల్లో వడగాల్పులు…
ఏపీలో ప్రజలు రానున్న 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరానికి చేరుకునే అతి తీవ్రమైన తుఫాను ‘మోచా’తో దేశంలోని తీర ప్రాంతాలు, ఓడరేవులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మూడు ఓడరేవులు, 12 జిల్లాలకు భారీ ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాద హెచ్చరిక నం.8ను దేశ వాతావరణ కార్యాలయం జారీ చేసింది.