High Temperatures: ఆంధ్రప్రదేశ్‌లో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. ఎండలు మండిపోతున్నాయి, వడగాల్పులు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.. నేడు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఈరోజు అల్లూరి జిల్లాలోని 2, అనకాపల్లిలో 1, బాపట్లలోని 7, తూర్పుగోదావరిలోని 7, పశ్చిమ గోదావరిలోని 3, ఏలూరులోని 4 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది.. ఇక, గుంటూరులోని 17 మండలాలు, కాకినాడలోని 9, కోనసీమలోని 10, కృష్ణా జిల్లాలోని 15, ఎన్టీఆర్ జిల్లాలోని 8, పల్నాడుజిల్లాలోని 9, మన్యంలోని 4, వైయస్సార్ జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీస్తాయని.. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
Read Also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలు నెరవేరుతాయి
ఇక, ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.. మరోవైపు.. నిన్న తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్ర 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో మూడు రోజుల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ రోజు మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.