Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
- మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్..
- మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా పరిశీలన..
- తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక..
- విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పారు. ఘటన జరిగిన రోజు, అంతకు ముందు భోజనం ఎలా ఉందని విద్యార్థులను మంత్రి అడిగారు. భోజనం బాగాలేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ ఆహారాన్ని విద్యార్థులు డస్ట్ బిన్ లో పడేసిన ఘటనపై సిబ్బందిని ఆరా తీశారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలిస్తున్నారా అని వాకబు చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మీ పై పవిత్ర బాధ్యత ఉంది. చిన్న సమస్య ఉన్నా తెలుసుకోవాలి, పరిష్కరించాలి. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించవద్దని హెచ్చరించారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యాబోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ప్రతి పాఠశాల తనకు ముఖ్యమేనని, అడ్మిషన్ల పెంపుతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని, అంగన్ వాడీ కేంద్రం పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
మైలవరం ఘటన నేపథ్యంలో విద్యార్థులకు అందే మధ్యాహ్న భోజనం పథకంపై ఇటీవల సమీక్షించిన మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలించాలని, బాగుందని నిర్థారించాకే విద్యార్థులకు పెట్టాలని ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. భోజనం గురించి విద్యార్థులు చెబితే తల్లిదండ్రులు వెంటనే లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!