AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎసస్సార్ కడప జిల్లాలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలో మంగళ వారం రోజు వర్షాలు కురవనున్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతా రామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్సీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్య సాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో బుధవారం రోజు కూడా వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Read also: Kodak CA Pro 65-inch TV: అతి తక్కువ ధరకే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. బెస్ట్ ఫీచర్స్!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 ఉదయం మధ్యలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడనం వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా జూలై 4, 5 న మధ్య ఆంధ్ర జిల్లాలైన బాపట్ల, ఎన్.టీ.ఆర్ (విజయవాడ తో పాటుగా), కృష్ణా, ఏలూరు, కోనసీమ, ఏలూరు, ఉత్తర ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు, నంధ్యాల, అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా.. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.