Weather Update: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో చలి పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు సాయంత్రం తర్వాత సూర్యోదయం వరకు పొగమంచు కొనసాగుతోంది. దీని కారణంగా దృశ్యమానత తగ్గుతుంది.
Weather Forecast : పర్వతాలలో నిరంతరాయంగా కురుస్తున్న మంచు ప్రభావం ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఉదయం, రాత్రి పాదరసం నిరంతరం పడిపోతుండగా మధ్యాహ్నం సూర్యుడు మండిపోతున్నాడు.
నేడు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారిపోయింది.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని.. విశాఖకు 380 కిలో మీటర్లు, పారాదీప్ కు 480 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలో మీటర్ల దూరంలో కేద్రీకృతం అయిఉన్నట్టు తెలిపింది
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట తీవ్రమైన ఎండలు, వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి వాతావరణం కనబడుతుంది. గత మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. కానీ, రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు చల్లని గాలులు వీస్తున్నాయి.
Weather Update: ప్రస్తుతం భారతదేశం అంతట శీతాకాలం మొదలవుతోంది. అయితే దక్షిణ భారతదేశంలోని చాలా తీర ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కేరళలో కొన్ని చోట్ల తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.