ఆ జిల్లాల నుండి ఒకరు ఇద్దరు కాదు.. ఎనిమిదిమంది ఎమ్మెల్సీలు…మండలిలో వరంగల్లు జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత దక్కిందా?తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వరంగల్లుకు కెసీఆర్ న్యాయం చేస్తున్నారా?శాసన మండలిలో వరంగల్ జిల్లా ఆధిపత్యం కనిపించనుందా? మండలిలో తెలంగాణలో ఏ ఇతర జిల్లాకు రానంత ప్రాధాన్యం వరంగల్ జిల్లాకు వచ్చిందా..?అవుననే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎంఎల్సీ పదవుల్లో సింహభాగం ఓరుగల్లుకే దక్కాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్న జిల్లాగా వరంగల్ జిల్లాకు గుర్తింపొచ్చింది.…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కిడ్నీ వాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లో తక్షణమే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎయిడ్స్ రోగులకు 5, హెపటైటిస్ రోగుల కోసం మరో 5 పడకలను కేటాయించాలన్నారు. Read Also: తెలంగాణ…
హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Read: ఆ గ్రామంలో నివశించాలంటే… ఆ అవయవం తీయించుకోవాల్సిందే.. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత…
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ- కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీల నేతలు ఇష్టం వచ్చి నట్లు మాట్లాడుతున్నారని, టీఆర్‌ఎస్ నాయకులపై అనవసర ఆరో పణలు చేస్తే ఊరుకోబోమని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరిం చారు. ఇకనైనా బీజేపీ నేతలు పిచ్చి కూతలు మానుకోవాలన్నారు. మా 60 లక్షల మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు తుమ్మితే ఆ తుంపర్లలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోతాయని,…
గత కొన్ని రోజులుగా ఏవోబీ బార్డర్ జరుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతే కాకుండా హిద్మా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా గడుపు తున్నారు. ఓవైపు పోలీసులు మరో వైపు మావోయిస్టులతో గిరిజన ప్రజలకు దినదిన గండంగా మారుతుంది. తాజాగా పట్ట పగలే మావో యిస్టుల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. భీమదేవరకొండ…
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటి సారి జాతర జరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం జాతరకు సంబంధించిన పనులను…
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది గులాబీ పార్టీ.. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ మొదట ఈ నెల 15న నిర్వహించాలనుకున్నా.. కొన్ని కారణాలతో దానిని 29వ తేదీకి వాయిదా వేశారు.. తెలంగాణ దీక్షాదివస్ అయిన ఈ నెల 29వ తేదీన సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే, మరోసారి ఈ…
వరంగల్ కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్, కోమటి పల్లి, జవహర్ నగర్ కాలనీలలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి అధ్వర్యంలో హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, కెయూసి, హన్మకొండ, సుబేదారి, మహిళ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్టర్లు 15 మంది సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు మరో 72 మంది ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 బెల్ట్…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా…
ఈ నెల 29 వ తేదీన వరంగల్ జిల్లాలో విజయ గర్జన సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్ భావించింది. ఇందులో భాగంగానే ఇవాళ హన్మకొండలోని దేవన్నపేటలో ఈ సభకోసం స్థలం పరిశీలించారు టీఆర్‌ఎస్ నాయకులు. ఈ నేపథ్యంలోనే.. టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు మరియు అక్కడి రైతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. టీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్ కోసం పంట పండే తమ పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్‌ఎస్ మరియు రైతుల మధ్య…