ఆసియాలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటి సారి జాతర జరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం జాతరకు సంబంధించిన పనులను చేస్తోంది. ఇప్పటికే ఈ జాతర పనుల కోసం ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.
సమ్మక్క- సారలమ్మ మహా జాతర-2022 తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16-19 వరకు ఈ మహా జాతర జరగనుంది. 16న సారలమ్మ కన్నెపల్లి నుండి గద్దెపైకి రాక, 17న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రాక, 18న భక్తులకు అమ్మవార్ల దర్శనం, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ జాత రకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ శాఖల అధికారుల తో జాతర పనులను ప్రభుత్వం చేపడుతుంది. మరో వైపు పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నా యి. జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో కొందరూ భక్తులు ఇప్పటి నుంచే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.