భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది. తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని…
ఓరుగల్లు టీఆర్ఎస్లో తూర్పు మంటలు రాజుకున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారా? ఏంటీ తాజా రగడ? ఎవరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పార్టీ నేతల ఫైర్..! వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీరు అధికారపార్టీ టీఆర్ఎస్‌లో సెగలు రేపుతోంది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోపై ఆయన చేసిన హడావిడి పార్టీలో చర్చగా మారడంతోపాటు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసే వరకు వెళ్లింది.…
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ వుంటుంది. అయితే నిధులు సకాలంలో అందకపోతే పరిస్థితి ఎలా వుంటుంది. ఓ గ్రామ సభలో సర్పంచ్,పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడి వేడుకుంటున్న సీన్ వరంగల్ జిల్లాలో కనిపించింది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వేడుకోవాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో గ్రామ సభ గందరగోళంగా మారింది. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ని నిలదీశారు. గ్రామ సభకు గ్రామ స్థాయి అధికారులు…
వరంగల్ లో మూడు సాహిత్య పాఠశాలలకు హాజరయ్యాను. వరంగల్ లో బంధువులు, మిత్రులు ఉన్నారు. వరంగల్ తో నాకు అవినాభావ సంబంధం ఉంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వరంగల్ కోర్టు బిల్డింగ్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… వరంగల్ పోరాట గడ్డ. విప్లవకారులు తిరిగిన నేల. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన ప్రాంతం వరంగల్ అని తెలిపారు. పొరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్ కు…
వరంగల్‌కు చెందిన ఓ బాలుడు అరుదైన అవకాశం పొందాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేందుకు ఆ బాలుడు అర్హత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ పట్టణంలోని గోపాలపూర్‌లో నివసిస్తున్న అనిక్ పాల్ ప్రస్తుతం ఆరో తగరతి చదువుతున్నాడు. వరంగల్ నిట్ సమీపంలోని గవర్నమెంట్ ఆర్‌ఈసీ పాఠక్ స్కూలులో అతడు అభ్యసిస్తున్నాడు. అయితే అనిక్ పాల్‌లో టాలెంట్‌ను గుర్తించిన అతడి తండ్రి విజయ్ పాల్.. ఎలన్ మస్క్ స్థాపించిన సింథిసిస్ స్కూలు గొప్పతనాన్ని…
వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది ఐటి దిగ్గజం జెన్పాక్ట్. తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్ ఫాక్ట్ రానుంది. మంత్రి కేటీఆర్‌ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్ ఫాక్ట్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి…
విశాఖ నగరానికి హెచ్‌ఎస్‌బీసీ కంపెనీ గుడ్ బై చెప్పింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇలా విశాఖను ఆ సంస్థ వదిలి వెళ్లడానికి అంతర్గత కారణాలు ఉన్నా విశాఖకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఇప్పటి వరకూ విశాఖకు రావాల్సిన కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గత ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూమి ఇస్తే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసి రద్దు చేసింది. తర్వాత ఇస్తామన్నా కూడా ఆ కంపెనీ…
రోజుకో తరహాలో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి… తాజాగా వరంగల్‌లో వెలుగుచూసిన ఘటన విస్మయానికి గురిచూస్తోంది.. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.. కానీ, వరంగల్ పోలీసు వారి ఆటలను సాగనివ్వలేదు.. అరెస్ట్ చేసిన కటకటాల వెనక్కి నెట్టారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివిధ కేసుల్లో నిందితులుగా వున్న సమయంలో వారికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కావల్సిన వత్రాలు, పూచికత్తు సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్…
వరంగల్ గడ్డమీద నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో నాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అఖండమైన విజయాలను నమోదు చేసుకోబోతుందని అన్నారు. Read: కేసులు పెరుగుతున్నాయి … జాగ్రత్తగా ఉండాలి… డిసెంబర్ 17న బన్నీ పుష్ప సినిమా వస్తుండగా, వచ్చే…