హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Read: ఆ గ్రామంలో నివశించాలంటే… ఆ అవయవం తీయించుకోవాల్సిందే..
ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరిపంట విషయంలో కేంద్రానికి, రాష్ట్రప్రభుత్వాన్ని మధ్య పెద్ద రగడ జరుగుతున్నది. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని, రైతులు యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది.