వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా చేసే పరికరం స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు ఒక హుక్కా కూజాతో పాటు దానికి వినియోగించే సామగ్రి మరియు ఆరు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు వివరాలను పోలీసులు వివరించారు. నిందితుల్లో శివ్వా రోహన్, వయస్సు 24, బి.టెక్ చదువుతున్నాడు.
పెంచికల కాశీరావు, మాదాపూర్, సైబరాబాద్ కి చెందిన వారుతో పాటు మత్తు పదార్థాలను సేవిస్తూ మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేయగా మరో యువకుడు పరారీలో వున్నాడు.ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు సంయుక్తం కల్సి హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో ఓలాడ్జిపై దాడులు నిర్వహించామన్నారు.
ఈ దాడుల్లో మత్తు పదార్థాలు సేవిస్తున్న ఆరుగురు యువకులను అదుపులో తీసుకోని విచారించగా, పోలీసులు అరెస్టు చేసిన యువకులందరు స్నేహితులు. వీరందరు చదువుకునే సమయంలో మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. గత మూడేళ్ళుగా వీరందరు మత్తు మదార్థాలను వినియోగిస్తున్నారు.
ఇందులో శివ్వా రోహన్ తరుచుగా గోవాకు వెళ్ళి నైజీరియా దేశానికి చెందిన జాక్ మరియు కాల్ జాఫర్లతో వున్న పరిచయంతో వారి వద్ద నుండి కొకైన్, చరస్ మరియు ఇతర రకాల మత్తు పదార్థాలను కొనుగోలు చేసేవాడు. ఆ మత్తుపదార్థాలను రోహన్ తన స్నేహితులు అమ్మడంతో పాటు వారితో పాటు స్థానికంగా వున్న లాడ్లో మత్తు పదార్థాలను సేవించేవాడు. ఈ క్రమంలోనే మరో నిందితుడు పెంచికల కాశీరావుతో రోహన్ కి పరిచయంకావడంతో కాశీరావు సైతం హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూండేవాడు.
తరచూ గోవాకు వెళ్ళి నైజీరియాకు చెందిన మరో వ్యక్తి వద్ద మత్తు పదార్థాలను కొనుగోలు చేసి రోహన్ తో పాటు ఇతర యువకులకు అమ్మేవాడని. పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారన్నారు.
తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోకైన్ లాంటి మత్తు పదార్థంతో పాటు ఇతర రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, సంతోష్, సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్, ఎస్.ఐ సాంబమూర్తి, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు మహేందర్, సృజన్, శ్రీనివాస్, శ్రీకాంత్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.