నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన మహాగర్జన సభకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు నిందించడమే పరమావధిగా పెట్టుకున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వాలు తొందరగా పూర్తి చేసుకున్న…
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీకి ‘కొండా’ అని నామకరణం కూడా చేశాడు. ఈ సినిమా నేపథ్యం వరంగల్ జిల్లా కాబట్టి ఎక్కువ భాగం సినిమా షూటింగ్‌ను వరంగల్, ఆ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరపాలని తొలుత నిర్ణయించారు. కానీ ఈ సినిమాపై పలువురు రాద్ధాంతాలు చేస్తున్నందున తాజాగా షూటింగ్ స్పాట్ మార్చినట్లు వర్మ తెలిపాడు. Read Also: ఒకేసారి నాలుగు…
ములుగు జిల్లా టేకుల గూడ అడవి ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి, తమ…
మేడారం మహాజాతర పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. జాతరకు ఇంకా నాలుగు నెలలే ఉంది. ఇప్పటికి జాతరకు సంబంధించిన పనులను మొదలు పెట్టలేదు. జాతరకు కోటిపై గా భక్తులు హాజరవుతారు. దానికి తగ్గట్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గత జాతరలో జరిగిన అపశృతులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు మొదలుపెట్టాల్సి ఉన్న ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించటం లేదు. జాతర పనులను పర్యవేక్షించాల్సిన ఏటూరునాగారం ఐటీడీఏకు…
కాకతీయ యూనివర్సీటీ పరిధిలో జరిగిన డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షా ఫలితాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు కళాశాల ప్రన్సిపాల్ మనోహార్ వివరాలు తెలిపారు. బీఎస్సీ, బీకామ్, బీఏ, డిగ్రీ మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు తెలియజేశారు. విద్యార్థులు అధికారిక సైట్‌లో తమ ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. లేదా కాలేజీలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. హనుమంతు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
అసలే ఓరుగల్లు. అక్కడ అధికారపార్టీ నేతలంతా పోరుకు కాలుదువ్వేవాళ్లే. ఒకరిపొడ ఇంకొకరికి గిట్టదు. ఇందుకు పండగలను వాడేసుకున్నారు. మా తీరు ఇంతే అని ఇంకోసారి రుజువు చేశారు. పార్టీలో చర్చగా మారారు. వారెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. బతుకమ్మ, దసరా ఉత్సవాల్లోనూ ఆధిపత్యపోరే..! బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య.. వరంగల్‌లో ఎమ్మెల్యేలు,…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ రోజు ప్రచారంలో భాగంగా బీజేపీ,టీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఒకరినొకరు మాటలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాటే పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల…
టీఆర్ఎస్ ఆవిర్భవించి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆపార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 15న వరంగల్ శివారులో ‘విజయగర్జన’ పేరుతో టీఆర్ఎస్ భారీసభను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నహాక సభను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ…
సంచలనాలకు మరియు వివాదాలకు కెరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక వివాదం పై వార్తల్లో నిలుస్తారు రామ్‌గోపాల్ వర్మ. అయితే.. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొండా చిత్రం కోసం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్జీవీ… వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారికి మద్యం తాగించారు. అక్కడి సంస్కృతి ప్రకారం గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించారు. ఆ…