మేడారం జాతర ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాబోతున్నది. ఫిబ్రవరి 16 నుంచి జాతర ప్రారంభం కాబోతున్నది. అయితే, జాతర కంటే ముందే భక్తులు మేడారంకు పోటెత్తుతున్నారు. జాతరలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ఆంక్షలు, జాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ఉద్దేశంతో ముందుగానే భక్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద…
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్…
హన్మకొండ చౌరస్తాలో ఇన్నోవా కారులో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. చాలా రోజులుగా రిపేర్ కోసం పక్కకు పెట్టిన ఇన్నోవాలో వ్యక్తి చనిపోయిన ఘటన పైన పోలీసు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.. సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ స్వీట్ షాపు లో పని చేసేవాడు.. తాగుడుకు బానిసగా…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడగా.. తాజాగా మరో 15 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 44కు చేరుకుంది. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా 29 మంది మెడికోలకు నిన్న మధ్యాహ్నం వరకు…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో ఐదుగురు మెడికోలు కరోనా బారినపడ్డారు. నిన్న 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. దీంతో కేఎంసీలో మొత్తం 22 మంది మెడికల్ విద్యార్థులు కరోనాకు గురయ్యారు. కరోనా అలజడితో అటు విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు. ఇదిలా వుంటే నిట్ లోనూ కరోనా…
మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. నిట్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థులు, మరో ఫ్యాకల్టీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు.. ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు… Read Also: ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు…
ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఉంటారు.. ముద్దుల పెళ్ళాం కోసం ఇద్దరు మొగుళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అయితే ఇద్దరు మగ వాళ్ళు ఇప్పుడు ఒకే భార్య కోసం పోరాటం చేస్తున్నారు. ఏకంగా వీధిపోరాటాలు పాటుగా మీడియా సమావేశాలు పెట్టి పోరాటాలు చేస్తున్నారు. అంతే కాదు భార్య నాది అంటూ నాది అని రోడ్డు మీద పడి కొట్టుకొని చస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెళ్ళాం పంచాయతీ చివరకు మీడియాకు ఎక్కింది. మీడియాలో రచ్చ చేసింది.…
భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది. తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని…
ఓరుగల్లు టీఆర్ఎస్లో తూర్పు మంటలు రాజుకున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారా? ఏంటీ తాజా రగడ? ఎవరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పార్టీ నేతల ఫైర్..! వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీరు అధికారపార్టీ టీఆర్ఎస్లో సెగలు రేపుతోంది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోపై ఆయన చేసిన హడావిడి పార్టీలో చర్చగా మారడంతోపాటు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసే వరకు వెళ్లింది.…
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ వుంటుంది. అయితే నిధులు సకాలంలో అందకపోతే పరిస్థితి ఎలా వుంటుంది. ఓ గ్రామ సభలో సర్పంచ్,పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడి వేడుకుంటున్న సీన్ వరంగల్ జిల్లాలో కనిపించింది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వేడుకోవాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో గ్రామ సభ గందరగోళంగా మారింది. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ని నిలదీశారు. గ్రామ సభకు గ్రామ స్థాయి అధికారులు…