బీజేపీ తొలితరం నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి ఇక లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లాలో చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో నివాసం వుంటున్నారు. సుదేష్మాను 1953లో వివాహం చేసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఈ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ జిల్లాలో మొదటి వ్యక్తి. జంగారెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్ గా పనిచేశారు.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
పరకాల నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి ఇండిపెండెంట్ బి. కైలాసంపై గెలిచి శాసనససభలో అడుగుపెట్టారు జంగారెడ్డి. అనంతరం భారతీయ జనసంఘ పార్టీ నుండి 1972లో పోటీచేసి పింగళి ధర్మా రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తరువాత 1978లో మళ్ళీ పింగళి ధర్మా రెడ్డి పై శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి విజయం సాధించారు జంగారెడ్డి. పరకాల కు బదులుగా ఆయన శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకున్నారు.

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం S.C రిజర్వ్ కావడంతో ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గం వారు కావడం వలన పరకాల పక్కనేఉన్న జనరల్ సీటు శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తలపడ్డారు. 1984 లో బీజేపీ 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం నుంచి ఏకే పాటిల్ అనే బీజేపీ నేత గెలిచారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి.
దక్షిణ భారతదేశం తొలి బీజేపీ తొలి పార్లమెంటు సభ్యుడుగా హనుమకొండ నుంచే ఎంపికయ్యారు చందుపట్ల జంగారెడ్డి. దక్షిణ భారతదేశం నుంచి ఆయనే తొలి బీజేపీ ఎంపీ కావడం ఓ రికార్డు. ఆ సమయంలో స్థానికుడు కావడం వలన అభిమానంతో జనం జంగారెడ్డిని ఆదరించారు. ఆ విజయం చరిత్ర పుటల్లో భద్రంగా ఉంది. 1989,1991,1996లో కాంగ్రెస్ పార్టీ నుండి కమాలుద్దీన్ అహ్మద్ చేతిలో జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి ఓటమి చెందారు. జంగారెడ్డి మరణం పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!