తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వం పై డైరెక్ట్ అటాక్ చేశారు. తాను లోలోపల రగిలిపోతున్న అంశాలన్నింటిపైన ఒక్క సారిగా కుండబద్దు కొట్టినట్టు చెప్పేశారు. వరంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభనే ఇందుకు వేదికగా చేసుకున్నారు ఆయన. సభకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరును, పార్టీ సీనియర్‌లుగా…
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఉదయం 10 గంటలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శాయంపేట హవేలికి చేరుకుంటారు మంత్రి కేటీఆర్. 10.15 గంటలకు కైటెక్స్ టెక్స్టైల్ పార్కు భూమి పూజ , మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన , యంగ్వన్ ఫొటో డెమో కార్య క్రమం , గణేష్ ఎకోపెట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం , అనంతరం అధికారులు , ప్రజాప్రతినిధులతో సమావేశం…
వరంగల్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ సభపై మంత్రి జగదీష్ రెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. దారిపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలన్నారు. ఏ.ఐ.సి.సి ప్రతినిధిగానా…పీసీసీ ప్రతినిధిగా ఆయన…
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. అటు రైతు కూలీలకు ఏడాదికి…
తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ కు వెలితిగా ఉంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మూడోసారి ఎలాగైనా పవర్లోకి రావాలని పట్టుదలగా ఉంది. అయితే సంస్థాగత లోపాలు పార్టీని వెంటాడుతున్నాయి. నేతల మధ్య అనైక్యత కూడా శాపంగా మారింది. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనలోనూ నేతలు తలోదారిగా ప్రవర్తిస్తుండటంతో.. శ్రేణులకు మింగుడుపడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటల్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వైఖరులే పార్టీ పుట్టి ముంచుతున్నాయని…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటించనున్నారు.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వరంగల్ పోలీసులు.. 6వ తేదీన రాహుల్ వరంగల్‌లో పర్యటించనుండగా.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు.. ఈ నేపథ్యంలో పలు కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. వాటిని ఫాలో కావాల్సిందిగా సూచించారు పోలీసులు. 06న (శుక్రవారం)మధ్యాహ్నం 2 గంటల నుండి హన్మకొండ…
ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే వరంగల్‌లో పలు సార్లు మంత్రి కేటీఆర్ పర్యటించారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత కూడా ఈ మధ్యే వరంగల్‌కు వెళ్లివచ్చారు.. ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో టూర్‌కు సిద్ధం అయ్యారు. అది కూడా రాహుల్ గాంధీ సభ ముగిసిన మరుసటి రోజే కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6వ తేదీన వరంగల్ వస్తున్నారు రాహుల్.. రైతు సంఘర్షణ సభ పేరుతో భారీ…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ.. త్వరలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోపర్యటించనున్నారు.. ఆయన పర్యటనలో వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టి.పీసీసీ.. ఏర్పాట్లపై దృష్టిసారించిది.. అందులో భాగంగా.. ఈ నెల 22న వరంగల్‌లో పర్యటించనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మరియు ముఖ్య…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు రాష్ట్రంలో పర్యటించనున్నారు.. అందులో భాగంగా వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.. ఆ సభలో పాల్గొని ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. అయితే, రాహుల్ కంటే ముందే వరంగల్ పర్యటనకు సిద్ధం అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఈ నెల 20వ తేదీన ఆయన వరంగల్ టూర్ ఖరారైంది.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన..…