తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది.. ఈ మేరకు రేపు (మంగళవారం) కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. వర్షా కాలం ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని కేబినెట్‌కు వివరించారు అధికారులు.. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ఆలస్యమైందని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు.. ధాన్యం పూర్తిగా కొనే వరకు కేంద్రాల కొనసాగించాలని కేబినెట్ ఆదేశించింది. కాగా, ఇటీవల వరంగల్ జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో భారీగా నష్టం జరిగింది.. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో.. మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించనున్నారు.