ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఉంటారు.. ముద్దుల పెళ్ళాం కోసం ఇద్దరు మొగుళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అయితే ఇద్దరు మగ వాళ్ళు ఇప్పుడు ఒకే భార్య కోసం పోరాటం చేస్తున్నారు. ఏకంగా వీధిపోరాటాలు పాటుగా మీడియా సమావేశాలు పెట్టి పోరాటాలు చేస్తున్నారు. అంతే కాదు భార్య నాది అంటూ నాది అని రోడ్డు మీద పడి కొట్టుకొని చస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెళ్ళాం పంచాయతీ చివరకు మీడియాకు ఎక్కింది. మీడియాలో రచ్చ చేసింది. అంతే కాదు భార్య నాది అని నాది అంటూ ఇద్దరు మొగుళ్ళు మీడియా ముందు గొడవ పడి తిట్టుకున్నారు. చివరకు పిల్లలు వచ్చారు. తల్లిదండ్రులు వచ్చి కూతుర్ని తిట్టిపోశారు . అయినప్పటికీ కూడా ఈ ముద్దుల భార్య ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరిని కొట్టింది. అంతే కాదు చివరికి నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే ఒక భర్తకు చెప్పేసి మొఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఈ తతంగం మొత్తం కూడా హైదరాబాద్ సెంటర్ లో జరిగింది.
వరంగల్ లో ఉండే శశికాంత్ కి మొదటి భార్య చనిపోయింది. మొదటి భార్య సోదరిని రెండో భార్య శశికాంత్ వివాహం చేసుకున్నాడు. దుర్గా కి ఇద్దరు పిల్లలు పుట్టారు. సంసారం సాఫీగా సాగిపోతుంది. అయితే ఇటీవల కాలంలో దుర్గా ఫేస్బుక్ లో సత్య ప్రసాద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తన భర్తను వదిలేసి దుర్గ ప్రియుడి దగ్గరికి వెళ్లి పోయింది.
దుర్గ సత్య ప్రసాద్ ని వివాహం చేసుకుంది. అక్కడే ఉంటుంది. అయితే తాను వివాహం చేసుకున్నానని తన భార్య కనిపించకుండా పోయిందని వెతికి పెట్టమని శశికాంత్ వరంగల్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలోనే దుర్గ ,సత్య ప్రసాద్ హైదరాబాద్ కి లో ఉన్నట్లుగా తేలింది .దీంతో కేసు ను ఎస్.ఆర్.నగర్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు సత్య ప్రసాద్ ని అదుపులోకి తీసుకొని విచారించారు.
అయితే తాను దుర్గ ను ప్రేమించి వివాహం చేసుకున్నారని, తన కు గతంలో పెళ్లి కాలేదని దుర్గ చెప్పాడి.. ఇదే విషయాన్ని కూడా చెప్పి వెళ్లిపోవాలని చూసింది.అయితే మొదటి భర్త ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆశ్రయించారు. తన భార్యకు మాయమాటలు చెప్పి సత్యప్రసాద్ తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని తెలిపారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. అయితే అప్పటికే శశికాంత్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు కూడా తమ తల్లి వెళ్ళిపోయిందని చెప్పారు. దీంతో దుర్గ ను పిలిపించి మాట్లాడదాం అని పోలీసులు అనుకున్నారు.ఇందులో దుర్గా కనిపించకుండా పోయింది . మూడు నెలల తర్వాత దుర్గ తిరిగి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. పోలీసులు కేసులో పురోగతి సాధించామని అనుకున్నారు. అయితే తనకు శశికాంత్ తో వివాహం కాలేదని తాను సత్య ప్రసాద్ వివాహం చేసుకున్నానని, తనకు పిల్లలు లేరు అంటు పోలీసులకు దుర్గా స్టేట్మెంట్ ఇచ్చింది.
మరోవైపు తన భర్త తో కలిసి దుర్గ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి మొదటి భర్త తో పాటు దుర్గా తల్లి దండ్రులు అత్తమామలు పిల్లలు అందరూ కలిసి వచ్చారు. దుర్గ నీ ని ఇంటికి రమ్మని చెప్పారు . అయితే మీరు ఎవరో తనకు తెలియదని దుర్గ tittiposindi. ఇద్దరు మొగుళ్ళు కలిసి మీడియా సమావేశంలోనే తిట్టుకున్నారు. దుర్గ నాది అంటూ నాది అని పరస్పరంగా దూషణలకు దిగారు. మొదటి భర్త శశికాంత్ చేసేది ఏమి లేక పిల్లలు అత్తమామలు తల్లితో కలిసి మళ్లీ పోలీసులకి వెళ్ళిపోయాడు. దుర్గా మాత్రం తనకు ఇప్పటికీ వివాహం కాలేదు. సత్యప్రసాద్ తో కలిసి ఉంటుందని చెప్పింది. పోలీసులు ఈ కేసు ను ఎలా slove చేయాలో అర్థం కాకుండా తలలు పట్టుకొని తీసుకుంటున్నారు.