Telangana Elections : వరంగల్ జిల్లా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రెండు కాళ్లు పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో పనిచేస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందటే ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు.
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ఈ వరంగల్ జిల్లా అని అన్నారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎలక్షన్స్ వస్తే పార్టీకి ఒక్కరు వస్తారని విమర్శించారు. తప్పకుండ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. ఎలక్షన్స్ ఐపోగానే దుకాణం మొదలవుతుంది.. పార్టీల చరిత్రల ఆధారంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Harish Rao Comments on Revanth Reddy: వరంగల్ జిల్లా నెక్కొండలో ఇవాళ ప్రచారం నిర్వహించిర మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలక్షన్స్ అనగానే ఢిల్లీ నంచి గల్లీ వరకు పూటకో లీడర్స్ వస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర మంత్రి నిర్మళ సీతారామన్ మోటర్లకు మీటర్ల పెట్టలేదని అన్నారు. 28వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే నిధులు ఆపి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీలు…
వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే…
నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు కట్టలు పంపుతుందట.. మీరు తిప్పికొట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కూడలిలో ఒక్కసారిగా గణేష్ మండపం కుప్పకూలింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 10 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గ్రామంలోనే ప్రథమ చికిత్స అందించారు.
కాంగ్రెస్ అధిష్ఠానంపై జంగా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానని.. ప్రజలు నన్ను గెలిపియ్యడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.