వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టింది అని విమర్శించారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు కట్టలు పంపుతుందట.. మీరు తిప్పికొట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు. పార్టీల చరిత్రలు చూసి ఓటెయ్యండి.. ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ కాంగ్రెస్.. ఓటు అంటే ఆశామాషీ కాదు.. తలరాతలు మార్చే గీత అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: MLA Laxmareddy: జోరుగా కొనసాగుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం
పాఖాల ఆయకట్టుకు నీరు అందించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని గులాబీ బాస్ కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో నర్సంపేటలో ఎవరూ చేయని అభివృద్ధిని పెద్ది సుదర్శన్ రెడ్డి చేశారు.. రాహుల్ గాంధీకి ఎవుసం అంటే తెలియదు.. కానీ ఆయన కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు. వరంగల్ వెళ్లాల్సిన మెడికల్ కాలేజీని పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకు తీసుకొచ్చారు.. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలి అని కేసీఆర్ కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు సంచులు పంపిందట.. షర్మిల పంపిన డబ్బు సంచులు కావాలా.. లేక అభివృద్ధి చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి కావాలా ఓటర్లు తేల్చుకోవాలి అని కేసీఆర్ చెప్పారు.