కేయూలో పీహెచ్డీ కేటగిరి-2 అడ్మిషన్ లలో ఎలాంటి అవకతవకలు జరుగలేదు అని ఆయన తేల్చి చెప్పారు. పారదర్శకంగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించామన్నారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారు.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించామని వీసీ రమేష్ తెలిపారు.
Warangal: గ్రేటర్ వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రత్యేక పరికరాలు ఉపయోగించి డోర్ హ్యాండిళ్లు, తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. గత రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో 10 దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్…
Warangal Earthquake: వరంగల్, మణుగూరులో ఇవాళ తెల్లవారుజామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతాల్లో భూమి కంపించింది.
Warangal: తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో గుండెపోటుతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులతో రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పురుగు మందులను సీజ్ చేశారు.
వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్డులో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ అయింది. ఎన్టీఆర్ నగర్ లో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ పేలుడులో భూక్య చంద్రు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరదలకు బోందివాగులో ఆ బాక్స్ కొట్టుకు వచ్చినట్లుగా గుర్తించారు.
వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు.
Warangal: వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చెరువులు ఏరులై పారాయి. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరడమే కాకుండా.. గాలివానకు ఇళ్ల పైకప్పు ఎగిరిపోయాయి. కొందరు నీళ్లల్లో కొట్టుకు పోగా మరికొందరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ సహాయంతో ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంది. వర్షం వరదలతో ఉమ్మడి వరంగల్…