Telangana Elections : వరంగల్ జిల్లా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రెండు కాళ్లు పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో పనిచేస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందటే ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. ఈ క్రమంలో ఆయనకు ఇప్పటి వరకు ఎన్నికల విధులు కేటాయించలేదు. ఈ ఎన్నికల్లో నర్సంపేట పట్టణంలోని బాలూర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వికలాంగుల ప్రత్యేక పోలింగ్ కేంద్రంలో ఏపీఓగా విధులు అప్పగించారు. తొలిసారి ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తనలాంటి వికలాంగ సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు.