ముగ్గు పిండి.. ముందుకు సాగని బతుకు బండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుద్ద గని ఆ గ్రామానికి నిధి…తాతల నాటి నుండి కొన్ని కుటుంబాలకు జీవనోపాధి అదే. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో ముగ్గుకి ప్రాధాన్యత ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో తెలతెలవారకముందే కళ్ళాపి జల్లి ముగ్గు వేయడం సనాతన ఆచారం. ముగ్గు పిండి తయారీకి పెట్టింది పేరైన బెన్నవోలులో ఇప్పుడేం జరుగుతోంది?
విశాఖ జిల్లా చోడవరం మండలంలో మేలు రకం ముగ్గు పిండికి పెట్టింది పేరు బెన్నవోలు గ్రామం. గ్రామ సమీపంలో సుద్దగని కొండ ఉంది. ఈ గ్రామానికి చెందిన పల్లీలు జాతికి చెందిన కొన్ని కుటుంబాలు, సుద్దపిండి అమ్ముకునే జీవనం సాగిస్తుంటాయి. శ్రమే వీరి వృత్తికి పెట్టుబడి. బెన్నవోలు గ్రామానికి అనుకొని ఉన్న కొండను సుద్దగని అని పిలుస్తారు. తెల్లవారుజామున సుమారు రెండు కిలోమీటర్ల కొండ ఎక్కి అక్కడున్న సుద్దరాయిని సేకరిస్తారు. గునపంతో తవ్వి ముడిసరకును బస్తాలలోకి నింపి, సైకిల్ మీద గ్రామానికి తరలిస్తారు. పెద్ద పెద్దగా ఉన్న సుద్దరాయిని చితక్కొట్టి, తారు రోడ్డు మీద ఆరబోస్తారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
రోడ్డుపై వెళ్లే వాహనాల ద్వారా బాగా తొక్కించి, ఎండబెట్టిన దానిని జల్లించిన ముగ్గు పిండిని బస్తాలకు నింపుతారు. ఈ పిండినే ఊరూరా తిరిగి అమ్ముకొని జీవనోపాధి సాగిస్తుంటారు. తమ ఇంటి దగ్గర బస్తా ముగ్గు పిండిని అమ్మితే 150 రూపాయలు, గ్రామాలకు పోయి అమ్మితే 500 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందంటున్నారు అమ్మకందారులు. కొన్ని ఊళ్లల్లో అయితే వస్తు మార్పిడికి ముగ్గు పిండి ఇస్తారు. డబ్బులకే కాకుండా బియ్యానికి సరిపడా ముగ్గుపిండిని ఇస్తారు అమ్మకం దారులు. పండగలు, పబ్బాలకు అయితే, ఇక్కడి ముగ్గు పిండికి మంచి గిరాకీ ఉంటుంది.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!