విశాఖలో మరోమారు మత్స్యకారుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రింగు వలల వివాదంతో నగరంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చారు. రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్‌కాట్ చేస్తున్నామని మత్స్యకార నాయకులు తెలిపారు. మత్స్యకారులు కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలు దేరగా అక్కడ మంత్రులు అప్పలరాజు, అవంతి వారితో చర్చలు జరిపారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడిచిపెట్టే వరకు చర్చలకు వెళ్లేది లేదని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు. మత్స్యకార వర్గాల వివాదంలో కార్పొరేటర్ కి పూనకం రావడం కాసేపు గందరగోళానికి దారితీసింది. బోట్లను కాల్చివేసిన ఘటనలో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలంటూ జాలరిపేట మత్స్యకారులు చేసిన ధర్నాలో పాల్గొన్నారు 19 వ వార్డు టీడీపీ కార్పొరేటర్ నూకరత్నం. కొద్దిసేపటికి పూనకంతో ఊగిపోయారు నూకరత్నం.
కార్పొరేటర్‌కి గంగమ్మ తల్లి పూనిందంటూ జేజేలు పలికారు మత్స్యకారులు. జాలరిపేట కే చెందిన నూకరత్నం తమ సంప్రదాయ వర్గ మత్స్యకారులతో కలిసి ధర్నా చేపట్టారు. మత్స్యకార గ్రామానికి చెందిన 19వ వార్డు కార్పొరేటర్ నూకరత్నంఆందోళనలో ఉండగా పూనకం రావడంతో హడావిడి చేశారు. కొద్దిసేపు పూనకంతో అలజడి సృష్టించారు కార్పొరేటర్.