అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు వచ్చామన్నారు హీరో బాలయ్యబాబు. ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు హీరో బాలకృష్ణ. ఇది మా విజయం మాత్రమే కాదు….చిత్ర పరిశ్రమ విజయం అన్నారు బాలకృష్ణ. ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను…
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య అరుపులు మారుమ్రోగిపోతున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూడడానికి నిజమైన అఘోరాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో ఇద్దరు అఘోరాలు సందడి…
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ ‘ఛత్రపతి’ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ ఘన విజయం సాధించి ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది ప్రభాస్ స్థాయిని పెంచిన సినిమా అని చెప్పవచ్చు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. పెన్ స్టూడియో సంస్థ బెల్లంకొండ సాయి శ్రీనివాస్…
దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతోంది… తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు జవాద్ తుఫాన్ టెన్షన్ పట్టుకుంది.. గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు… ముందస్తు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు.. ఇక, సమస్య తలెత్తిన సబ్ స్టేషన్లు, ఫీడర్లు మరమ్మత్తు కోసం ప్రత్యేక…
తుఫాన్ హెచ్చరికలతో అప్రమత్తం అయింది విశాఖ పోలీసు శాఖ. నగర ప్రజలు,వాహనదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు సిటీ పోలీసులు. రేపటి నుంచి ఆదివారం వరకు తుఫాన్ ప్రభావం ఉంటుంది. భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు విరిగిపడ్డం, రహదారులు జలమయం అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. రవాణాకు అడ్డంకులు ఏర్పడతాయి కనుక వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప తుఫాన్ సమయంలో రోడ్లపైకి రావద్దని కోరింది. రాబోయే తుఫాన్ కి సంబంధించి విశాఖ…
టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు.త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తామని… ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజంకి మంచి అవకాశాలున్నాయని… ఇప్పటికే శ్రీశైలం సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ, నెల్లూరులో, బీచ్ కోస్టల్ కారిడార్ అభివృద్ధి చేస్తామని… కేంద్ర పర్యాటక శాఖ…
మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన…
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…
విశాఖ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వి.ఎస్.ఎన్.కుమార్ పై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. పాడేరు ఐటీడీఏ లో ఇఇ గా పని చేస్తున్నారు కె.వి.ఎస్.ఎన్.కుమార్. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదు రావడంతో నిన్న ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. ప్రభుత్వ విలువ ప్రకారం రెండు కోట్ల అరవై లక్షల విలువ చేసే ఆస్తులు స్వాధీనం…
విశాఖలో ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం కలకలం రేగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రేమ జంట. కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అమ్మాయి విశాఖ వాసి కాగా, అబ్బాయిది వరంగల్. పంజాబ్లో కలిసి చదువుకుంది ఈ జంట. ఈ ఆత్మహత్యకు గల కారణాలు బయటపడ్డాయి. ప్రేమించాలని అడగ్గా యువతి నిరాకరించింది. దీంతో అతను ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతకుముందు నీతో మాట్లాడాలని అమ్మాయిని లాడ్జి కి తీసుకెళ్ళాడు ఆ యువకుడు.…