ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలే టార్గెట్‌గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల నుంచి ఐటీ అధికారుల టీమ్ విశాఖకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో ప్రముఖ బిల్డర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది…
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు(35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు. వీరు నలుగురు కలిసి…
ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ గతంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్ధల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు రంగంలోకి దిగారు. ఆ ఆదేశాలతో విద్యాశాఖాధికారులు తమ ప్రతాపం చూపడం మొదలెట్టారు. పురాతనమయిన, ఎంతో చరిత్ర కలిగిన విద్యాసంస్థల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు…
మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ విజయనగరం జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.. వైసీపీలో బొత్స పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాన్ని చిటికెలో కొల్పోయిన వ్యక్తి బొత్స.. అలాంటి గొప్ప నేత బొత్సకు కనీసం హోం మంత్రో.. పరిశ్రమల మంత్రో.. ఆర్థిక మంత్రో అవుతారు అనుకున్నా… కానీ, చివరికి మున్సిపల్…
విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ముఠాను అరెస్ట్ వారి వద్ద నుంచి కారు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . దీనికి సంబందించి గూడెం కొత్తవీధి సీఐ అశోకుమార్ వివరాలు అందచేశారు. విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి . కృష్ణారావు ఆదేశాలు మేరకు చింతపల్లి ఎఎస్పీ తుషారూదీ , సీసీఎస్ డీఎస్పీ డీఎస్ఆర్ఎఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జీకేవీధి సీఐ అశోకకుమార్…
ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్, గంజాయి వ్యవహారంపై చేసిన విమర్శలు, ఆరోపణలు కాస్త శృతిమించి తీవ్ర వివాదానికి, కేసులకు దారి తీశాయి.. అయితే, మరోసారి డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం, చేసే పరిస్థితులు ఇవ్వండి.. 48 గంటల్లో కట్టడి చేస్తారన్నారు. కానీ, ఈ ప్రభుత్వం వారికి అధికారాలు ఇవ్వదని ఆరోపించారు. ఇక, రోడ్ల…
రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు. నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి మద్దతుగా జనసేనాని బహిరంగ సభ జరగనుంది. ఈ సభ కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు పవన్ కళ్యాణ్.ఆయనకు అడుగడుగునా వేలాదిమంది స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం టూర్‌కు సిద్ధం అయ్యారు.. రేపు విశాఖలో పర్యటించనున్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా పోరాటంలో పాల్గొననున్నారు.. ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు.. వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు.. అయితే, వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది.…
విశాఖ మన్యంలో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సామాన్య గిరిజనులు. ఇక గర్భిణీల బాధలు అన్నీ ఇన్నీ కావు. పురిటి నొప్పులతో నిండు గర్భవతి పాపకు జన్మనిచ్చి తిరిగిరాని లోకాలకు చేరింది. ఆ గిరిజన మహిళ మృతి చెందడంతో ఆ చిన్నారితో మరో ముగ్గురు పిల్లలు తల్లిలేని వారయ్యారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన రహదారి లేని కారణంతో అది రాలేదు. దీంతో ఆ గర్భిణీ నరకయాతన అనుభవించింది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం…