ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయం కొత్త కాదు.. కానీ, మరోసారి కులరాజకీయం తెరపైకి వస్తోంది.. తాము అంటే తామేనని ప్రకటిస్తున్నారు నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందన్న ఆయన.. కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని ప్రకటించారు.. ఇక, ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయని చెప్పుకొచ్చారాయన.. భారతీయ జనతాపార్టీది సబ్ కా సత్ సబ్ కా వికాస్ నినాదంతో అభివృద్ధికి కృషి చేస్తున్నందని వెల్లడించిన జీవీఎల్.. ఏపీకి కేంద్రం విస్తృతంగా నిధులు సమకూర్చింది.. కేంద్రం ఇచ్చిన ప్రయోజనాలపై గుడ్డ కప్పే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
Read Also: క్లైమాక్స్‌కి పీఆర్సీ ఎపిసోడ్..!https://ntvtelugu.com/ap-government-employees-will-meet-with-cm-ys-jagan-over-prc/
పార్లమెంట్‌లో టీడీపీ, వైసీపీ మాకు సానుకూలంగా ఉన్నాయని గుర్తుచేశారు ఎంపీ జీవీఎల్.. మరోవైపు.. ఏపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.. స్టీల్ ప్లాంట్, పోలవరం వంటి అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడిగినట్టు ఎక్కడా వినలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే పోలవరం ప్రాజెక్టును మేమే నిర్మిస్తాం అన్నారు.. రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇక, విభజన హామీల అమలు, ప్రాజెక్టుల పనితీరు పరిశీలన కోసం బీజేపీ ఎంపీ జీవీఎల్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.