విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ లో విశాఖకు స్థానం లభించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని.. గ్రోత్ హబ్ గా మారుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఈనెల 15న వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు మరోసారి మోదీ సర్కార్ కోరుకుంటున్నారని.. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు.
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.
NITI Aayog: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను ప్లాన్ చేస్తోంది. ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్ నగరాల ఆర్థిక పరివర్తణ కోసం ఒక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు, ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సాయపడుతుందని నీతిఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం తెలిపారు. నగరాలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నందున, మరో 20-25 నగరాల ఆర్థిక ప్రణాళికను సిద్ధం…
ఏపీలో సంచలనంగా మారిన ఎమ్మార్వో రమణయ్య మర్డర్ కేసులో నిందితుడిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో భాగంగా పోలీసులు రెండో రోజు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని విచారిస్తున్నారు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగారాం కాల్ డేటా కీలకంగా మారింది.
ఈనెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పట్నం వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ముగింపు వేడుకలు విశాఖలోని ACA స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మమ్మరం చేశారు. చెన్నైలో నిందితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.