YV SUbba Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకు వెళ్లాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్మోహన్ రెడ్డి అప్పజెప్పిన బాధ్యత నిర్వహించడమే నా బాధ్యత అని స్పష్టం చేశారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు గెలుపు దిశగా మేం కృషి చేస్తాం అని వెల్లడించిన ఆయన.. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ రావాల్సిందే అన్నారు.. ఇక, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు వైవీ.. అన్ని సీట్లు అనౌన్స్ చేసినప్పుడు చిన్న చిన్న మార్పులు ఉంటే చేయడం జరుగుతుందన్నారు.. ఇప్పుడు ఒకటి రెండు సీట్లు మినహా సీట్లు విషయంలో మార్పులు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Hospitality and Tourism Sector: గుడ్ న్యూస్.. ఆ రంగం తర్వలో ఐదు కోట్ల ఉద్యోగాలు
కాగా, వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డితో పాటు మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు సోమవారం రోజు నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. వీరికి సీఎం బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికీ అవకాశం కలిపిస్తున్నారని తెలిపారు. తమకు ఇచ్చిన ఈ అవకాశంతో ముగ్గురం కూడా విజయం సాధిస్తామని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు అందరు కోరుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్న విషయం విదితమే.