Vizag: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీయాదవ్ మధ్య వ్యక్తి గత కక్షలు మరోసారి బహిర్గతం అయ్యాయి. తన రాజకీయ జీవితాన్ని ఎంపీ దెబ్బకొట్టారని భావిస్తున్న ఎమ్మెల్సీ వంశీయాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు ఎంవీవీ. ఆయన ప్రత్యర్ధిగా హ్యాట్రిక్ ఎమ్మెల్సీ వెలగపూడి రామకృష్ణబాబు బరిలోకి దిగుతున్నారు. జనసేన-టీడీపీ పొత్తుల కారణంగా ఉమ్మడి అభ్యర్ధి అయిన రామకృష్ణబాబు విజయం కోసం కలిసి పని చేస్తామని వంశీయాదవ్ ప్రకటించారు. అదే సమయంలో తనకు రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్ధిగా భావిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వంశీ యాదవ్. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంటికి వచ్చి మరీ తంతానని.. ముఖ్యమంత్రి కాదు కదా దేవుడు వచ్చిన కాపాడలేడని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: PM Modi: నేడు నోఖ్రా సోలార్ ప్రాజెక్టు జాతికి అంకితం.. తెలంగాణకు కరెంట్
ఇక, వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడం ఖాయమని.. అది జనసేన, టీడీపీ విధానం అయితే.. తన వ్యక్తిగత అవసరమని ప్రకటించారు వంశీ. బిల్డర్ అయిన ఎంవీవీపై వ్యక్తిగత ఆరోపణల తో పాటు వ్యాపారపరమైన అభియోగాలు చేశారు ఎమ్మెల్సీ. అయితే, ఎంవీవీ, వంశీ మధ్య వివా దం కొత్తది కాకపోయినా బహిరంగంగా ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. సిట్టింగ్ ఎంపీపై ఎమ్మెల్సీ ప్రయోగించిన భాష చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఎమ్మెల్సీ వంశీ తీవ్రపదజాలంపై ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎంవీవీ.
Read Also: Bitcoin : బిట్‌కాయిన్ రెండేళ్ల గరిష్టానికి పెరగడానికి వెనుక కారణం ఏమిటి?
ఈనేపథ్యంలో వంశీపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు ఎంపీ. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీల మధ్య వ్యక్తిగత వ్యవహారం పూర్తిస్థాయిలో పార్టీలకు పాకేలా కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో ఎంవీవీకి వైరం వుంది. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఎంపీని టార్గెట్ పెట్టింది జనసేన. నగరం నడిబొడ్డున సీబీసీఎన్సీ సహా ఎంవీవీ నిర్మాణ కంపెనీల్లో కొనుగోళ్లు చేయవద్దని ప్రభుత్వం మారిన వెంటనే వాటిపై చర్యలు వుంటాయని హెచ్చరిస్తోంది. ఇటీవల వరకు వైసీపీలోనే వున్న ఎమ్మెల్సీ వంశీయాదవ్ రెబల్ గా మారి జనసేనలో చేరారు. ఆయనకు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది జనసేన. ఈనేపథ్యం లో ఎంపీ, ఎమ్మెల్సీ మధ్య వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠ పెరుగుతోంది.