Minister RK Roja: విపక్షాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోయడం, విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా చూడకుండా అభివృద్ధి చేస్తున్నాం.. కానీ, చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిసియన్స్ వల్ల రాష్టం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజకీయలద్ధి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీతో, ఇప్పుడు బీజేపీ – జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. పవన్ కల్యాణ్ మాటలు విని విని బోర్ కొట్టడంతో.. ఇప్పుడు షర్మిలను రంగంలోకి దించారని ఆరోపించారు. ఇక, షర్మిల టైమ్ పాస్ రాజకీయలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆమె.. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్ట్ అని విమర్శించారు..
Read Also: Delhi Chalo: అరగంటలో బారికేడ్లను బద్దలుకొడతాం అంటూ.. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించిన రైతులు!
మరోవైపు.. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చింది అని షర్మిలపై ఫైర్ అయ్యారు రోజా.. వైఎస్సార్ పంచెలు ఉడాదీసి కొడతా అన్నా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పెళ్లికి ఆహ్వానం ఇచ్చారు.. టీడీపీ కోవర్ట్ అన్నా రేవంత్ రెడ్డితో ఏ మొహం పెట్టుకొని పొత్తు పెట్టుకుంది..? అని ప్రశ్నించారు. వినే వాడు వెర్రి వాడు అయితే చెప్పే వాడు షర్మిల అన్నట్లుగా మారింది ఆమె పరిస్థితి అని సెటైర్లు వేశారు. షర్మిలకు అసలు ఏం గుర్తింపు ఉంది? ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప..? అని నిలదీశారు మంత్రి రోజా.
Read Also: Medigadda Barrage: మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీఆర్ఎస్- బీజేపీ
ఇక, దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన మన సీఎం జగన్ మోహన్ రెడ్డిది.. మట్టిలో మాణిక్యలను వెలుగులోకి తెచ్చారు.. అంటూ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం విషంలో సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు రోజా.. 5 దశల్లో జరుగుతున్న ఈ పోటీల్లో 3 లక్షల మ్యాచ్‌లు జరిగాయి.. 120 కోట్లు వెచ్చించి ఆడుదాం ఆంధ్రా క్రీడలు నిర్వహిస్తుంది వైసీపీ ప్రభుత్వం అన్నారు. క్రీడాకారులకు స్వర్ణయుగం ఆడుదాం ఆంధ్రా అని అభివర్ణించిన ఆమె.. చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రానికి ఏమి లేకుండా చేసిన ఘనత ఆయనదే అని మండిపడ్డారు. అంతర్జాతీయ ప్లేయర్స్ కు గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు అకాడమీలు పెట్టుకోవడనికి ప్రోత్సాహం ఇస్తున్నారు సీఎం జగన్.. ఆడుదాం ఆంధ్రలో గెలుపొందిన ప్లేయర్స్ కు మంచి ఫ్రాంచైస్ తో అటాచ్ చేసి ఉన్నత స్థాయిలో నిలబెడతాం.. రాష్ట్రంలో ఉన్నత విద్యా, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు మంత్రి ఆర్కే రోజా.