విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రుషికొండలోని అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ లను 22ఏ నుంచి తప్పించేందుకు ఎమ్మార్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఎమ్మార్వో, రియల్టర్ గంగారాం మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇరువురి మధ్య రుషికొండ అపార్ట్మెంట్స్ తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి.
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్…
విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అనంత శర్మ(పూజారి )అనే వ్యక్తి ఫోన్ చేయడంతో రమణయ్య ఇంటి నుంచి కిందకి వచ్చినట్లు తెలిసింది.
విశాఖలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖలోని నేవల్ డాక్ యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను కేంద్ర మంత్రి జాతికి అంకితమిచ్చారు. నేవీ అవసరాల కోసం ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను ఉపయోగించనున్నారు.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. క్రీజులో జైస్వాల్ (179), అశ్విన్ (5) ఉన్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు సాధించాడు…
విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రేపటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు రోజులపాటు ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగిపోయాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించనున్నారు.
విశాఖలోని అరుకులో భారతదేశం భవిష్యత్తును రూపొందించే కీలకమైన విషయాలపై యంగ్ థింకర్స్ ఫారం చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పల్సస్ గ్రూప్ అధినేత గేదెల శ్రీనుబాబు పాల్గొని ఎలక్షన్ సీన్ ఫోకస్ నావిగేట్ ఇన్ ది డెమొక్రటిక్ మేజ్, ప్రజాస్వామ్యం యువత యొక్క పాత్ర అనే అంశాలపై ప్రసంగించారు. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించటానికి ఇది మంచి వేదిక అని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఒక్క పాలన యొక్క రూపం మాత్రమే కాదు.. ఇది…
పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి.. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ రావాలని చెప్పండి.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి.. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే.. ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదిక నుంచి.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.. వారి నుంచి సిద్ధం అంటూ సమాధానాన్ని రాబట్టారు..