Minister Buggana Rajendranath Reddy: భారత్ లోనే విశాఖపట్నంకు అన్ని ప్రాధాన్యతలు వున్న నగరంగా గుర్తింపు ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. రానున్న కాలంలో విశాఖ పరిపాలన కేంద్రంగా మారనుందని తెలిపారు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారని గుర్తుచేశారు.. గడిచిన రెండేళ్లలో విశాఖలో అనేక రకాల మౌలిక సదుపాయాలు సీఎం కల్పించారని తెలిపారు. విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ప్రజలందరూ ఆమోదిస్తున్నారని తెలిపారు. ఇక, భవిత ద్వారా యువతలో నైపుణ్యత పెరుగుతుందని వెల్లడించారు. పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యత శిక్షణ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన మేలు జరగనుందన్నారు. ఏ ప్రభుత్వం ఆలోచించని రీతిన సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అనుకూల పాలన అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
Read Also: India Not A Nation: “భారత్ ఒక దేశం కాదు”.. డీఎంకే నేత రాజా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా కూటమి..
కాగా, వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఈ రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే.. విజన్ విశాఖ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం విశాఖ నుంచే పాలన సాగిస్తా.. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.. కాస్త మెరుగులు దిద్దితే విశాఖ మంచి రాజధాని అవుతుందన్న ఆయన.. ఇక్కడ ఆర్థికపరమైన వృద్ధి బాగుందన్నారు.. అదే అమరావతిలో రాజధాని అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలపైనే ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇక, పదేళ్లలో హైదరాబాద్, చెన్నైకి పోటీగా విశాఖ ఉండాలని ఆకాక్షించారు.. అందుకనే అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని సీఎం వైఎస్ జగన్ తెలిపిన విషయం విదితమే.