విశాఖలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ మాట్లాడుతూ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు జాతి కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసామని.. ఎన్నికల సమయంలో తమ ఓట్లు మీకు కావాలి కాబట్టి తమ ఇబ్బందులు గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయాలని పేర్కొన్నారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభంకు ఎవరు సముచిత స్థానం కలిపిస్తారో వారికి మద్దతిస్తామని తోట రాజీవ్ తెలిపారు.
Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్
తమకు ఇచ్చిన పథకాలన్నీ కలిపి కాపులకు ఇంత ఇచ్చామని సీఎం జగన్ చెబుతున్నారని అన్నారు. అనేక కాపు భవనాలు ఇంకా పునాది దశలోనే ఉండిపోయాయని.. జిల్లాల విభజన సమయంలో కాపు నాయకులు పేర్లు పెట్టాలని కోరితే ఒక్కపేరు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వాలు అయినా.. కాపుల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. రాజకీయ పార్టీలు కాపుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన కోరారు.
TDP: ఉండి టీడీపీలో వర్గపోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే మండిపాటు
కాపు జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదని తోట రాజీవ్ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం.. తమకు 27 శాతం సీట్లు కేటాయించాలని… ఈ పరిస్థితి ఏ పార్టీలోను లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఒక్క సీటు కాపులకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాపుల సమస్యలు పోరాటం చేసిన వారికి సీట్లు ఇవ్వాలన్నారు. కాపు కులాన్ని రాజకీయ నాయకులు కరివేపాకులా చూస్తున్నారని.. 2014లో ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఉద్యమం చేసి కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ గుర్తు చేశారు.