Vizag: ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన విశాఖ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విశాఖలోని గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్(33) ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి.. ఎంఎస్ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 14న నాగప్రసాద్‌కు ఫణికుమార్ రూమ్‌మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి మంగళవారం తీసుకెళ్లారు. ఆయన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్‌లకు పరిస్థితిని వివరించగా.. అక్కడి అధికారులతో మాట్లాడిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు ఊరట చెందారు. కుమారుడి మృతతో ఫణికుమార్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Also: Madras High Court: భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యలో ఆస్తిలో వాటా