CM Chandrababu: ముంబై తరహాలో ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేవీ డే సందర్భంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ విన్యాసాలను తిలకించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో తూర్పు నావికాదళం సేవలు అద్భుతమైనవి అన్నారు.. ఈస్ట్ కోస్ట్ లో ఎకనామిక్ యాక్టివిటీ పరిరక్షణ బాధ్యత నేవీ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏపీ మారిటైమ్ గేట్ వేగా విశాఖ మారుతుందన్న ఆయన.. ముంబై తరహాలో ఏపీకి విశాఖ ఆర్థిక రాజధానిగా పేర్కొన్నారు.. వైజాగ్ నాలెడ్జ్, టూరిజం హబ్‌గా మారుస్తాం అన్నారు.. మెట్రో, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేస్తాం… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు శంఖుస్తానప చేస్తారని తెలిపారు..
Read Also: Vikarabad: పావురాలతో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు..
ఇక, ఈ ఏడాది అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు వస్తాయి అని తెలిపారు సీఎం చంద్రబాబు.. వచ్చే ఏడాది విశాఖకు గోదావరి జలాలు వస్తాయి.. ఐఎన్ఎస్ విరాట్ ను తీసుకుని వచ్చేందుకు వున్న అవకాశాలను పరిశీలిస్తాం అన్నారు.. మెడికల్, ఫార్మా హబ్ గా విశాఖ మారుతుంది.. వికసిత భారత్ నినాదంతో డిఫెన్స్ రంగంలో దుసుకుని పోతున్నాం.. స్వర్ణాంధ్ర 2047 రూపకల్పన చేసి ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తాం.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నేవీ సహకరించాలని కోరారు.. ఓషన్ ఏకానమికి విస్తృతమైన అవకాశాలు వున్నాయి.. ఆ దిశగా గట్టి ప్రయత్నం జరగాలి.. అందుకు నేవీ సహకారం అందించాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..