థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాంక్షిత జిల్లాలు, మండలాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని బండి సంజయ్ తెలిపారు.
యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు.
మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాక్షాత్తు సీఎం తమ ప్రాంతానికి వస్తుండటంతో మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూసీ నదిని శుద్ధి చేసి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేయవద్దని, మన దేశంలోనే సరిపడా పత్తి నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసి రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు.
బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు CSR కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది.
తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం వారికి.. పది లక్షల చెక్కును అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్నారిపై అఘాయిత్యం బాదేసింది.. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్య చేయడం మరింత బాధించిందని తెలిపారు. అలిమేలు మంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.
అత్తాపూర్ మూసీ పరీవాహక ప్రాంతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసేది పేదల కోసం కాదు.. డబ్బు సంచుల కోసం, బ్లాక్ మెయిలింగ్ కోసమని ఆరోపించారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. నడమంత్రపు సిరితో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దని దుయ్యబట్టారు.
అంబర్పేట మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలతో కలిసి ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హైడ్రాకు సపోర్ట్ చేశానని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.
అబుదాబి యువరాజు ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెల (సెప్టెంబర్)లో భారత్‌లో పర్యటించనున్నారు. కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. పర్యటనలో భాగంగా.. భారతదేశం-యుఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.