ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి (31వ తేదీ)న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం 10.50కి నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామానికి చేరుకోనున్నారు.
Read Also: PM Modi: అక్కినేని నాగేశ్వరరావు కృషిని ప్రశంసించిన నరేంద్ర మోడీ
ఉదయం11.00 – 11.30 వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం.. 11.35-12.35 వరకు లబ్ధిదారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.40-01.00 వరకు పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 01.45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతరం మధ్యాహ్నం 2.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Pro Kabaddi League 2024: ప్రో కబడ్డీ విజేత గా హర్యానా స్టీలర్స్..