సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు హాజరు కానున్నారు. చంద్రబాబు బృందంతో పాటు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు హాజరు కానున్నారు.
Read Also: Pawan Kalyan: కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ట్వీట్..
చంద్రబాబు వెంట దావోస్ వెళ్లే అధికారులలో సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సీఎం సెక్యూరిటీ అధికారి శ్రీనాధ్ బండారు, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల కార్యదర్శి ఎన్ యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సీఎం సాయికాంత్ వర్మ, కాడా పిడి వికాస్ మర్మత్ ఉన్నారు. ప్రపంచంలోని పలు దేశాల ప్రతినిధులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సులో వివరించనున్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Nadendla Manohar: నాలుగు సంవత్సరాల తర్వాత రైతులకు నిజమైన సంక్రాంతి వచ్చింది..